నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదాల మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన మాజీ సీఎం కేసీఆర్

నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదాల మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన మాజీ సీఎం కేసీఆర్

నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదాల మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన మాజీ సీఎం  కేసీఆర్

నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.

 బీఆర్ఎస్ పార్టీపై బండ్ల గణేశ్ విమర్శలు

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సినీ నటుడు బండ్ల గణేశ్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేదపత్రంపై ఆయన స్పందిస్తూ... పవర్ లేనోళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని ప్రశ్నించారు. మీరు ఏంచేశారు, ఎంత దోచుకున్నారు, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లారో తాము చెప్పగలమని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎంత వెనకబడ్డారో చెప్పగలమని తెలిపారు. తాము చెప్పిన విషయాలను ప్రజలు నమ్మారు కాబట్టే... కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదని... ఇంతలోనే మీకెందుకింత బాధ, భయం అని ప్రశ్నించారు. కొంత సమయం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పాలిస్తుందని చెప్పారు.