చైనా దివాలా తీసింది..తిండీ తిప్పలకూ కష్టమే: జిన్ పింగ్

చైనా దివాలా తీసింది..తిండీ తిప్పలకూ కష్టమే: జిన్ పింగ్

చైనా దివాలా తీసింది..తిండీ తిప్పలకూ కష్టమే: జిన్ పింగ్

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్ తెలిపారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ ఒడిదొడులకు లోనవుతుందని తెలిపారు. కొన్ని ఎంటర్ ప్రైజెస్ ఇబ్బందులు చవి చూస్తున్నాయని చెప్పారు. కొంత మందికి ఉద్యోగాలు లభించకపోవడంతో కనీస అవసరాలు తీరడం లేదని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను కూడా ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు.

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వేగంతమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, జిన్ పింగ్ ప్రసంగించడానికి కొన్ని గంటల ముందే నేషనల్ బ్యూరో ఆఫ్​ స్టాటిస్టిక్స్ నెలవారీ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎమ్ఐ) డేటాను విడుదల చేసింది. డిసెంబరులో ఫ్యాక్టరీ కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయినట్లు అందులో తెలిపింది. మాన్యుఫ్యాక్చరింగ్ పీఎమ్ఐ 49కి తగ్గిందని చెప్పింది. కాగా, చైనా మాన్యుఫ్యాక్చరింగ్ పీఎమ్ఐ వరుసగా మూడో నెలలోనూ తగ్గింది.