తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదు .. పురందేశ్వరి

తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదు .. పురందేశ్వరి

తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదు ..  పురందేశ్వరి

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడం వల్లే తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదని విమర్శించారు. టీటీడీ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీటీడీ నిర్లక్ష్యంపై బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. జగన్ ది స్టిక్కర్ల ప్రభుత్వమని... కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అమలాపురంలో బీజేపీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • బాబు, పవన్ ల కుట్రలు ఫలించవని  

    వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్య

  • వైనాట్ 175 లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని... అందుకే పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తున్నామని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీని వీడటం సాధారణంగా జరిగేదే అని చెప్పారు. మార్పు అవసరం అనుకున్న చోటే ఇన్ఛార్జీలను మారుస్తున్నామని తెలిపారు. అంతకు ముందు పని చేసిన నేతలకు కొత్త వాళ్లు సహకరించాలని కూడా చెపుతున్నామని అన్నారు. 

    ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడంపై స్పందిస్తూ... బీసీలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవిని ఇప్పించామని తెలిపారు. ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన పార్టీకి రాజీనామా చేసి వెళ్లడంపై ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఎన్ని కుట్రలు పన్నినా ముఖ్యమంత్రి జగన్ కు తిరుగులేదని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రజలు మళ్లీ జగన్ నే గెలిపిస్తారని అన్నారు. కోర్టు కేసుల వల్లే విశాఖకు రాజధాని తరలింపు అంశం ఆలస్యమవుతోందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని... త్వరలోనే జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారని అన్నారు.