చైనాలో భూకంపం : కుప్పకూలిన ఇల్లు, ఆఫీసులు

చైనాలో భూకంపం : కుప్పకూలిన ఇల్లు, ఆఫీసు

చైనాలో భూకంపం : కుప్పకూలిన ఇల్లు, ఆఫీసులు

చైనా దేశంలో భూకంపం గట్టిగానే వచ్చింది. ఏ విషయాన్ని ప్రపంచానికి నిజం చెప్పని చైనా.. భూకంపం విషయంలోనూ సరైన వివరాలు వెల్లడించలేదు. గన్సూ ప్రావిన్స్ ప్రాంతంలో అర్థరాత్రి సమయంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదైంది.. మొదట 5.4గా చెప్పిన చైనా.. ఆ తర్వాత 6.2గా స్పష్టం చేసింది. ఈ భూకంపం ధాటికి చాలా భవనాలు కూలిపోయాయి.. బిల్డింగ్స్ ఊగిపోయాయి.. చాలా ప్రాంతాల్లో ఇల్లు నేల మట్టం అయ్యాయి.. అర్థరాత్రి సమయం కావటంతో.. నిద్రలో ఉన్న వారు.. శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే సహాయ చర్యలు ఊపందుకున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ.. మృతుల సంఖ్య పెరుగుతుందని స్థానిక మీడియాతోపాటు.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

భూకంపం ధాటికి గన్సూ ప్రాంతంలో.. చాలా భవనాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 116 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించినా.. 250 మంది వరకు గాయపడినట్లు వెల్లడించింది. శిథిలాల తొలగింపు వేగవంతం అయిన తర్వాత.. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

చైనాలో భారీ భూకంపం సంభవించింది. పలు భవనాలు నేలమట్టం కావడంతో 110 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రిక్కర్ స్కేలుపై దీని తీవ్రత6.2గా నమోదయ్యింది.

 డిసెంబర్ 18 రాత్రి చైనాలోని కింగ్ హై ప్రావిన్స్ లో  గన్స్ లో భూకంపం సంబవించినట్లు అక్కడి మీడియా తెలిపింది.  భూకంపం దాటికి చాలా భవనాలు కూలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న చైనా రెస్క్యూ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.  ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం వల్ల 23 మంది గాయపడ్డారు. భవనాలు కుప్పకూలిపోయాయి.