వరల్డ్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఉన్న దేశం..యూనైటెడ్ ఎమిరేట్స్

వరల్డ్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఉన్న దేశం..యూనైటెడ్ ఎమిరేట్స్

వరల్డ్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఉన్న దేశం..యూనైటెడ్ ఎమిరేట్స్

ప్రపంచంలో ఎక్కువ దేశాలకు వీసా రహితంగా సేఫ్ ప్రయాణానికి పాస్ పోర్ట్ అందిస్తున్న దేశాలను పవర్ ఫుల్ పాస్ పోర్ట్ అందిస్తున్న దేశంగా గుర్తిస్తారు. 2024లో వరల్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ గా తన స్థానాన్ని UAE మరోసారి నిలబెట్టుకుంది. గ్లోబల్ ఫైనాన్షియల్ అడ్వైజింగ్ ఆర్గనేజేషన్ అయిన అర్టన్ క్యాపిటల్ 2024 పాస్ట్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం..UAE పాస్ పోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా దాని హోదాను నిలబెట్టుకుంది. 

 UAE  పాస్ పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లోకి వెళ్లొచ్చు. ఇందులో 120 దేశాలకు వీసా రహిత యాక్సెస్ ఉంది. ఆన్ లైన్ లేదా వచ్చిన తర్వాత 50 దేశాలకు వీసాలు పొందే అవకాశం ఉంది. దీంతో UAE  వరల్డ్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ కంట్రీగా మొదటి స్థానంలో ఉంది. 

శక్తివంతమైన పాస్ పోర్ట్ లు కలిగిన ఇతర దేశాలు 

రెండో స్థానంలో జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ నుండి పాస్ పోర్టులు 178 దేశాలకు ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నాయి. స్వీడన్, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, ఆస్త్రియా , స్విట్జర్లాండ్ నుంచి పాస్ పోర్టులు 177 దేశాలకు యాక్సెస్ ను మంజూరు చేస్తూ మూడో స్థానంలో ఉన్నాయి. 

డెన్మార్క్, బెల్జియం, పోర్చుగల్, పోలాండ్, ఐర్లాండ్, దక్షిణాఫ్రియా పాస్ పోర్టులు ప్రపంచ వ్యాప్తంగా 176 దేశాలకు ప్రవేశం కల్పిస్తూ నాల్గో స్థానంలోఉన్నాయి. ఐదో స్థానంలో సింగపూర్, గ్రీస్, నార్వే, చెక్ రిపబ్లిక్, యూనైటెడ్ కింగ్ డమ్, హంగేరీ, జపాన్ , న్యూజీలాండ్ లు తమ పాస్ పోర్టులతో 176 దేశాలకు ప్రవేశాన్నిఅనుమతిస్తున్నాయి. 
భారత్ ఎక్కడుంది..
అర్టన్ క్యాపిటల్ ద్వారా 2024 పాస్ పోర్ట్ ఇండెక్స్ లో భారతీయ పాస్ పోర్ట్ జాంబియాతో పాటు 66 స్థానంలో ఉంది. భారతీయ పాస్ పోర్ట్ 198దేశాలకు యాక్సెస్ కల్పిస్తుండగా, వాటిలో 121 దేశాలకు వీసా అవసరం. భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు 26 దేశాలలో వీసా రహిత ప్రయాణాన్ని పొందుతున్నారు. అయితే 51 దేశాలకు వీసా ఆన్ అరైవల్ అవసరం ఉంది.