ఖర్గే తనయుడికి కేటీఆర్ కౌంటర్

ఖర్గే తనయుడికి కేటీఆర్ కౌంటర్

ఖర్గే తనయుడికి కేటీఆర్ కౌంటర్

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలపై ఎక్స్ వేదికగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం జరిగిన ట్వీట్ వార్‌లోకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే వచ్చారు. అబద్ధాలు, అవకతవకల విషయంలో కేటీఆర్‌ కూడా బీజేపీని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలుగా మారినందుకు ఇలాంటి అబద్దపు ప్రచారాలు వారికి నిత్యకృత్యంగా మారాయన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను, వార్తలను తిప్పికొట్టడానికే కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయబోతోందంటూ ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.

 ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 'హాయ్ ప్రియాంక్ గారు. మీరు కూడా ఈ ఇష్యూలో చేరాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం. మీ నాయకుడు రాహుల్ గాంధీ కర్ణాటక యువతకు రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చేసిన ప్రకటన, మీ డిప్యూటీ సీఎం ఖజానా ఖాళీగా ఉందని చేసిన ప్రకటనలు కూడా తప్పుడువేనా..? దోస్త్.. తెలంగాణలో ముగ్గురు ఎంపీలు సహా బీజేపీ పెద్ద తలకాయలను ఓడించింది మేమే. కాంగ్రెస్‌ కానే కాదు. సునీల్ అండ్‌ టీమ్‌ ప్రచారం పట్ల మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది' అని చురకలు అంటించారు.

శ్వేతపత్రాన్ని ఏపీ రిటైర్డ్ అధికారితో తయారు చేయించారు: హరీశ్

 రావు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ శ్వేతపత్రంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని అన్నారు. చూపించిన లెక్కలన్నీ తప్పులేనని చెప్పారు. ఈ శ్వేతపత్రాన్ని ఏపీకి చెందిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని చెప్పారు. 

హరీశ్ రావు ప్రసంగంలోని హైలైట్స్:


గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికను తయారు చేయించారు. 
అప్పులను రెవెన్యూతో పోల్చారు. అప్పులను జీఎస్డీపీతో పోల్చలేదు. 
కరోనా కారణంగా ఎక్కువ అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతించింది. 
కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల భారం పెరిగినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదు. 
లక్ష కోట్లు కేంద్రం నుంచి రానందువల్లే ఇబ్బంది కలిగింది. 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి. లేకపోతే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. పెట్టుబడులు కూడా ఆగిపోతాయి. 
అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో కింద నుంచి ఐదో స్థానంలో తెలంగాణ ఉంది.

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వెంటనే ఈ అంశంపై చర్చను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. మాట్లాడేందుకు తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు అవకాశం ఇచ్చారు. హరీశ్ రావు మాట్లాడుతూ... 42 పేజీల నోట్ ఇచ్చి 4 నిమిషాలు కూడా కాలేదు... దీన్ని చదవకుండా ఏం మాట్లాడాలి అధ్యక్షా? అని అన్నారు. నోట్ ను చదవడానికి తమకు కొంత సమయం కావాలని చెప్పారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... ఒక గంట సేపు టీ బ్రేక్ ఇస్తే నోట్ ను చదువుకుంటామని కోరారు. అలాగే సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సభకు అరగంట టీ బ్రేక్ ను స్పీకర్ ఇచ్చారు