ఆటోడ్రైవర్ల ఇబ్బందులు.. మా దృష్టికి వచ్చింది: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆటోడ్రైవర్ల ఇబ్బందులు.. మా దృష్టికి వచ్చింది: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆటోడ్రైవర్ల ఇబ్బందులు.. మా దృష్టికి వచ్చింది: మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలకు బస్సులో ఉచిత రవాణా సౌకర్యంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని.. వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు మంత్రి  పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 19 వతేదీ మంగళవారం ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం  ముగిసిన అనంతరం మంత్రి  పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. "ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఈరోజు 5,126 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో చాలా మంది సొంత ఇల్లు లేదని వచ్చారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వాళ్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మా దృష్టికి వచ్చింది. ఆటో డ్రైవర్లు మా సోదరులే... వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలి" అని చెప్పారు.

హైదరాబాద్ లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి జరగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగుతున్న ప్రజావాణికి తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా జనంగా తరలివస్తున్నారు. తెల్లవారుజము నుంచే  ప్రజాభవన్  కు వస్తున్న ప్రజలు.. అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.