బస్ భవన్‌లో జరిగిన చర్చలు సఫలO .. సజ్జనార్

బస్ భవన్‌లో జరిగిన చర్చలు సఫలO .. సజ్జనార్

బస్ భవన్‌లో జరిగిన చర్చలు సఫలO .. సజ్జనార్

బస్ భవన్‌లో అద్దె బస్సు యజమానులతో జరిగిన చర్చలు సఫలమైనట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అద్దె బస్సుల యజమానుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గురువారం వారితో టీఎస్ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో గురువారం అద్దె బస్సు యాజమానులతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం సమావేశమైందని... ఈ సందర్భంగా ఐదు అంశాలను వారు... టీఎస్ఆర్టీసీ దృష్టికి తీసుకు వచ్చారన్నారు.

వాటిపై సంస్థ ఉన్నతాధికారులతో కలిసి చర్చించి... ఈ సమస్యల పరిష్కార సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టీఎస్ఆర్టీసీ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను పరిశీలించిన తర్వాత.. ఆ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని అద్దె బస్సు యాజమానులకు తెలియజేశామన్నారు. ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

మంత్రిని కలిసిన యజమానులు

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను గురవారం ఉదయం అద్దె బస్సు యజమానులు కలిశారని... తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ అంశంపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి తనను ఆదేశించినట్లు వెల్లడించారు.

'అద్దె బస్సు యాజమానులు కొన్ని అంశాలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజు సుదీర్ఘంగా చర్చించాం. రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైంది. ఆ కమిటీ అన్ని అంశాలను శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తుంది. సంస్థ బస్సులు, అద్దె బస్సుల డేటాను క్రోడికరించి..  ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై అద్దె బస్సు యాజమానులు సానుకూలంగా స్పందించారు' అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.