హరీశ్ రావును మాజీ మంత్రి అని అనను... అని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య

హరీశ్ రావును మాజీ మంత్రి అని అనను... అని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య

హరీశ్ రావును మాజీ మంత్రి అని అనను... అని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య

దుబ్బాక నుంచి 54వేల మెజార్టీతో తను గెలిపించి తనపై చాలా బాధ్యత పెట్టారని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల అవసరాలను తీర్చేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. తనకు దుబ్బాక ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని.. వారి రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో లేకపోయినా హరీశ్ రావు సిద్దిపేట అభివృద్ధి చేశారని... అలాగే తామిద్దరం జొడెద్దుల్లా పని చేసి దుబ్బాక, సిద్దిపేటను అభివృద్ధి చేస్తామన్నారు.

హరీశ్ రావును తాను మాజీ మంత్రి అని అనని... తర్వాత తిరిగి తాజా మంత్రి అవుతాడని జోస్యం చెప్పారు. ఇది ఎన్నికల సంవత్సరం.. కార్యకర్తలు నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. కష్టపడి లోక్ సభ ఎన్నికల్లో పని చేసి, అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకుందామని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అందరం కలిసి పని చేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. రానున్నది మన ప్రభుత్వమే కాబట్టి కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు.

 దయచేసి పనులు మాత్రం ఆపొద్దు: మంత్రి దామోదరకు మాజీ ఎమ్మెల్యే

 విజ్ఞప్తి

నియోజకవర్గంలో తాము ప్రారంభించిన పనులను ఆపవద్దని ఆందోల్ ఎమ్మెల్యే, మంత్రి దామోదర రాజనర్సింహకు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత క్రాంతి కిరణ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ... అందోల్‌లో అభివృద్ధి పనులను ఆపాలని మంత్రి దామోదర చూస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆందోల్ నియోజకవర్గంలో ఎస్డీఎఫ్, సీడీపీ నిధులతో అభివృద్ధి పనులు చేశానన్నారు. 80 శాతం వరకు గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించానని వెల్లడించారు.

కొన్ని టెండర్లు పూర్తయ్యాయని... మరికొన్ని పనులు నడుస్తున్నాయన్నారు. అయితే ఈ పనులను ఆపాలని మంత్రి దామోదర అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. మంజూరైన నిధులు సరిపోకపోతే మరిన్ని నిధులు ఇవ్వాలని సూచించారు. అంతేకానీ పనులను మాత్రం ఆపవద్దని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులలో రాజకీయ కక్షసాధింపు చర్యలు సరికావని... సహకరించాలని హితవు పలికారు.