సంక్రాంతికి జనవరి 12 నుంచి 17 వరకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సంక్రాంతికి జనవరి 12 నుంచి 17 వరకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సంక్రాంతికి జనవరి 12 నుంచి 17 వరకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి సెలవులు ప్రకటించింది. పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటన విడుదల చేసింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. జనవరి 12 శుక్రవారం నుంచి సెలవులు ప్రారంభమవుతాయి.

13వ తేదీన రెండే శనివారం, 14వ తేదీ ఆదివారం అవుతోంది. ఇదే రోజున భోగి వచ్చింది. 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉంది. 17వ తేదీన పాఠశాలలకు ప్రభుత్వం అదనంగా సెలవును ప్రకటించింది. రెండో శనివారం, ఆదివారం కలిపి మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. 18వ తేదీన అన్ని విద్యాసంస్థలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.