ఫేమస్ మిరాకిల్ డ్రింక్.. ఎప్పుడైనా తాగారా..

ఫేమస్ మిరాకిల్ డ్రింక్.. ఎప్పుడైనా తాగారా..

ఫేమస్ మిరాకిల్ డ్రింక్.. ఎప్పుడైనా తాగారా..

కంజి... అంటే బీట్ రూట్, క్యారెట్ తో చేసే ఒక జ్యూస్. దీన్నే ప్రొబయోటిక్, మిరాకిల్ డ్రింక్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆ డ్రింక్ కి ఆ పేర్లే ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది. ఈ నార్త్ ఇండియా ఫేమస్ డ్రింక్ తయారీ కూడా రెగ్యులర్ జ్యూస్ ల్లా ఉండదు. ఈ వింటర్ స్పెషల్ డ్రింక్ కి ఇంకా చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. 

ఈ జ్యూస్ లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ లోని జెల్ మార్చేస్తుంది. దానివల్ల తక్కువ తిన్నా కడుపు నిండుగా అనిపిస్తుంది.. బ్లడ్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అలాగే వీటిల్లోని కార్బోహైడ్రేట్స్ రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతాయని చెప్తున్నారు. సెలబ్రిటీ న్యూట్రిషియనిస్ట్ రుజుతా దివేకర్. క్యారెట్స్లోలో ఉండే ఆంథోసైనిన్ కంటిచూపుని మెరుగు పరుస్తుంది.

బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా జరిగేలా చూస్తుంది. ఈ జ్యూస్ రెగ్యులర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని చాలా స్టడీల్లోనూ తేలింది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లని కూడా దరిచేరనివ్వదు ఈ జ్యూస్. అల్జీమర్స్ ని తగ్గిస్తుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే.

తయారీ..

రెండు బీట్రూట్స్, రెండు బ్లాక్ క్యారెట్లని ముక్కలుగా చేసి గాజు సీసాలోకి తీసుకోవాలి. అందులో ఒకటీ స్పూన్ ఉప్పు, ముప్పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, చిటికెడు పసుపు, కారం వేసి లీటరున్నర నీళ్లు పోసి కలపాలి. ఆ జార్పై పొడి క్లాత్ చుట్టి ఐదారురోజులు ఎండలో పెట్టాలి. రోజుకోసారి ఆ మిశ్రమాన్ని కలుపుతుండాలి. 5 రోజుల తర్వాత జ్యూస్ నీ కంటైనర్ లోకి తీసుకుంటే టేస్టీ కంజి రెడీ.