న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై పోలీస్ ఆంక్షలు

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై పోలీస్ ఆంక్షలు

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై పోలీస్ ఆంక్షలు

న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. వేడుకలను డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకే ముగించాలని ఆదేశించారు. ఈవెంట్ నిర్వహకులు పది రోజుల ముందుగానే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. పోలీసులు పెట్టిన ఆంక్షలు ఇలా ఉన్నాయి.  

  • ప్రతీ ఈవెంట్ లో సీసీ కెమెరాలు తప్పనిసరి
  • ఈవెంట్స్ లో సెక్యూరిటీ తప్పనిసరి
  • అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు
  • 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దు
  • కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దు
  • పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి
  • సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దు
  • లిక్కర్ ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదు
  • న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు
  • సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దు