నేటితో ముగుస్తున్న లోకేశ్ యువగళం .. లోకేశ్ తో పాటు నడిచిన కుటుంబ సభ్యులు

నేటితో ముగుస్తున్న లోకేశ్ యువగళం .. లోకేశ్ తో పాటు నడిచిన కుటుంబ సభ్యులు

నేటితో ముగుస్తున్న లోకేశ్ యువగళం ..   లోకేశ్ తో పాటు నడిచిన కుటుంబ సభ్యులు

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చివరి రోజుకు చేరుకుంది. చివరి రోజు యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యాత్ర చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. జనసేన శ్రేణులు కూడా లోకేశ్ తో కలిసి నడుస్తున్నాయి. మరోవైపు పాదయాత్ర ముగుస్తుండటంతో నారా, నందమూరి కుటుంబ సభ్యులు విశాఖకు చేరుకున్నారు. లోకేశ్ వెంట తల్లి నారా భువనేశ్వరి, అత్త వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు కలిసి నడిచారు. ఈ ఏడాది జనవరి 27న పాదయాత్ర ప్రారంభమయింది. మొత్తం 97 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభను టీడీపీ పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది. 

 యువగళం విజయోత్సవ సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగియబోతోంది. మరోవైపు ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభ నుంచే టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఇరువురు నేతలు ఆ రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సభకు ఇరు పార్టీలకు సంబంధించి లక్షలాది మంది తరలిరానున్నారు. ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను టీడీపీ ఏర్పాటు చేసింది.