దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చిన కోహ్లీ

దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చిన కోహ్లీ

దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చిన కోహ్లీ

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా, టెస్టు సిరీస్ ముంగిట ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చాడు. కోహ్లీ కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చాడని, దక్షిణాఫ్రికాతో డిసెంబరు 26 నుంచి జరిగే తొలి టెస్టు నాటికి జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, కోహ్లీ ఏ కారణాలతో భారత్ వచ్చాడన్నది బోర్డు వెల్లడించలేదు. కాగా, కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ మరోసారి గర్భవతి అయిందని ఇటీవల కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే కోహ్లీ, అనుష్క దంపతులకు వామిక అనే కుమార్తె ఉంది.

భారత్-సౌతాఫ్రికా మధ్య బోలాండ్ పార్క్‌లో మూడో వన్డే

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో కేశవ్ మహారాజ్‌ది ప్రత్యేక స్థానం. భారతీయ మూలాలు కలిగిన ఈ ఆటగాడు ఎప్పుడు మైదానంలోకి దిగినా బ్యాక్‌గ్రౌండ్‌లో ‘రామ్ సియా రామ్’ పాట ప్లే అవుతూ ఉంటుంది. భారత్‌తో నిన్న బోలాండ్ పార్క్‌లో జరిగిన మూడో వన్డేలో అతడు బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు కూడా ఇదే పాట డీజేలో ప్లే అయింది. కేశవ్ మహారాజ్ బ్యాటింగ్‌కు దిగినా, బౌలింగ్‌కు సిద్ధమైనా ఈ పాట మైదానంలో తప్పనిసరిగా ప్రేక్షకుల చెవిని తాకుతుంది. 

నిన్న కూడా అతడు బ్యాటింగ్ కి వస్తున్న సమయంలో అదే పాట ప్లే అయింది. దీంతో ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న కేశవ్‌ను పిలిచి మరీ అడిగేశాడు. ‘‘కేశవ్ భాయ్.. నువ్వు ఎప్పుడొచ్చినా ఈ పాట (రామ్ సియా రామ్) పాట ప్లే చేస్తారా?’’ అని అడిగాడు. అవునంటూ కేశవ్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. స్టంప్స్ వద్ద ఉన్న మైక్‌లో వీరి సంభాషణ రికార్డయింది. ఆపై సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది.