శంకర్ నుంచి 'గేమ్ ఛేంజెర్'

శంకర్ నుంచి 'గేమ్ ఛేంజెర్'

శంకర్ నుంచి 'గేమ్ ఛేంజెర్'

చరణ్ - శంకర్ కాంబినేషన్లో 'గేమ్ ఛేంజర్' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఆయన కెరియర్లో అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే. అలాంటి ఈ సినిమా .. షెడ్యూల్స్ పరంగా కాస్త ఎక్కువ గ్యాప్ నే తీసుకుంటోంది. అవతల 'ఇండియన్ 2' సినిమాతో శంకర్ బిజీగా ఉండటమే అందుకు కారణం. 

అలాంటి ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.  ఈ రోజునే ఈ షెడ్యూల్ షూటింగు మొదలైంది. ప్రస్తుతం శ్రీకాంత్ .. సముద్రఖని .. ఎస్. జె. సూర్య కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. త్వరలో చరణ్ కూడా ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొంటాడని అంటున్నారు. 

చరణ్ జోడీగా ఈ సినిమాలో కియారా అద్వాని అలరించనుంది. చరణ్ తో ఆమెకి ఇది రెండో సినిమా. ఇతర ముఖ్యమైన పాత్రలలో సునీల్ ... అంజలి .. నవీన్ చంద్ర కనిపించనున్నారు. యాక్షన్ సీన్స్ .. సాంగ్స్ ..  తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనే టాక్ వినిపిస్తోంది.

  • కాలేజ్ చదువు చెన్నైలో సాగిందన్న రాఘవేంద్రరావు

తెలుగు సినిమాను పవర్ఫుల్ గా .. తెలుగు పాటను కలర్ఫుల్ గా  ఆవిష్కరించిన దర్శకుడు రాఘవేంద్రరావు. తాజాగా ఆయన ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " నా కాలేజ్ రోజులన్నీ చెన్నైలో గడిచాయి. అప్పట్లో ఈ ఫోన్లు లేవు .. యూత్ ఇంత ఫాస్టుగా ఉండేది కాదు" అని అన్నారు. 

" అప్పట్లో ప్రేమలోపడితే లెటర్ రాయడం .. ఆ లెటర్ ఆమెకి చేరిందో లేదో చూసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ తలకాయ నొప్పంతా నాకు ఎందుకు అనుకునేవాడిని. ఇష్టమైన వాళ్లు కనిపిస్తే మాట్లాడేవాడిని. స్నేహితులతో కలిసి పిట్టగోడలపై కూర్చుని .. రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలను చూసేవాడిని. అంతే తప్ప ఎవరితో లవ్ ఎఫైర్ లేదు" అని చెప్పారు. 

"ఇక పెళ్లిళ్ల విషయానికి వస్తే, అప్పట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. అందువలన విడిపోవడమనే సంఘటనలు చాలా తక్కువగా జరిగేవి. ఇప్పుడు .. ఈ జనరేషన్ లో చాలా చిన్న చిన్న విషయాల దగ్గర విడిపోతున్నారు. కోట్ల రూపాయలను ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నవారు కూడా ఏడాది తిరిగే సరికి విడిపోతున్నారు" అని అన్నారు.