లోక్ సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

లోక్ సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

లోక్ సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. లోక్ సభలోకి దుండగుల చొరబాటు అంశంపై ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. డిసెంబర్ 13న జరిగిన ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. తాజాగా లోక్ సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ఫరూక్ అబ్దుల్లా, శశిథరూర్, ఫైజల్, కార్తీ చిదంబరం, సుప్రియా సూలే, మనీశ్ తివారీ, డింపుల్ యాదవ్ తదితరులు ఉన్నారు. తాజా సస్పెన్షన్లతో కలిపి ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య (ఉభయ సభలు) 141కి చేరుకుంది. లోక్ సభలో 95 మంది, రాజ్యసభలో 46 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వీరందరినీ ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేశారు.

పార్లమెంట్​లో భద్రతా వైఫల్యంపై కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో అపోజిషన్ పార్టీ లీడర్లు ఆందోళనలు చేపడుతున్నారు. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే కొందరు సభ్యులు స్పీకర్ వెల్​లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని సభను అడ్డుకున్నారు. సెక్యూరిటీ బ్రీచ్​పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడాలంటూ పట్టుబట్టారు. దీంతో సభా నియమాలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన లోక్​సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సోమవారం ఒకే రోజు 79 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. 
పోయిన వారం లోక్​సభ నుంచి 13 మంది, రాజ్యసభ నుంచి ఒకరిపై వేటు వేశారు. దీంతో ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన వారి సంఖ్య మొత్తం 93కు చేరుకుంది. సోమవారం కూడా లోక్‌‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. సభ్యుల నిరసన కొనసాగడంతో ఉభయ సభలను సభాపతులు మంగళవారానికి వాయిదా వేశారు 
లోక్​సభ నుంచి మొత్తం 33 మంది ఎంపీలను స్పీకర్ సోమవారం సస్పెండ్ చేశారు. ఉదయం నుంచి వాయిదాపడుతూ వచ్చిన లోక్​సభ.. మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ ప్రారంభమైంది. అయినా ప్రతిపక్ష పార్టీల లీడర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. దీంతో 33 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ సభ్యుడు రాజేంద్ర అగర్వాల్ ప్రకటించారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి సస్పెండ్ అయిన వారి పేర్లను చదివి వినిపించారు.
 ఇందులో కాంగ్రెస్‌‌ సభాపక్ష నేత అధిర్‌‌ రంజన్‌‌ చౌదురితో పాటు టీఎంసీ, డీఎంకే, ఐయూఎంఎల్, ఆర్ఎస్​పీ, జేడీ(యూ) పార్టీలకు చెందిన సభ్యులు ఉన్నారు.  వీరిని శీతాకాల సమావేశాలు ముగిసే దాకా సస్పెండ్ చేశారు. 33 మందిలో జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీఖ్​లు మాత్రం ప్రివిలేజెస్ కమిటీ నివేదిక అందేవరకు సస్పెండ్​లో ఉంటారని స్పీకర్ ప్రకటించారు.
రాజ్యసభ నుంచి మొత్తం 46 మందిని చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ సస్పెండ్ చేశారు. వీరిలో 35 మందిపై ఈ శీతాకాల సమావేశాల వరకు వేటు వేశారు. మిగిలిన 11 మంది ప్రివిలేజెస్​ కమిటీ నివేదిక అందేవరకు సస్పెండ్​లో ఉంటారని స్పష్టం చేశారు. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ సభ్యులు జైరామ్ రమేశ్, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సహా డీఎంకే నుంచి కనిమొళి, ఆర్​జేడీ నుంచి మనోజ్ కుమార్, తదితరులు ఉన్నారు. ఇప్పటికే రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్‌‌ ఓబ్రియెన్‌‌పై ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌‌ అమల్లో ఉంది.