భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. కంపెనీల అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండబోతున్నాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ ఉదయం ట్రేడింగ్ ను లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 491 పాయింట్లు లాభపడి 71,847కి చేరుకుంది. నిఫ్టీ 141 పాయింట్లు పుంజుకుని 21,659కి పెరిగింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (4.44%), ఎన్టీపీసీ (3.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.93%), భారతి ఎయిర్ టెల్ (2.31%), యాక్సిస్ బ్యాంక్ (2.27%). 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.85%), టాటా స్టీల్ (-0.78%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.74%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.72%).