తాజా ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు .. తాను పరిచయం చేసిన వాళ్లంతా స్టార్స్ అయ్యారని వ్యాఖ్య

తాజా ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు .. తాను పరిచయం చేసిన వాళ్లంతా స్టార్స్ అయ్యారని వ్యాఖ్య

తాజా ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు  ..  తాను పరిచయం చేసిన వాళ్లంతా స్టార్స్ అయ్యారని వ్యాఖ్య

రాఘవేంద్రరావు తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక భారీ విజయాలను అందిస్తూ వెళ్లారు. 'కలియుగ పాండవులు'తో వెంకటేశ్ ను ..  'రాజకుమారుడు'తో మహేశ్ బాబును .. 'గంగోత్రి'తో బన్నీని హీరోలుగా పరిచయం చేశారు. తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. 

"ఏఎన్నార్ డాన్సులను అందరూ ఎంజాయ్ చేసేవారు. కానీ పిల్లలు డాన్సులు చేయడమనేది .. చిరంజీవి డాన్సులను చూసిన తరువాతనే మొదలైంది. పిల్లలపై చిరంజీవి అలాంటి ప్రభావాన్ని చూపించారు. ఒకసారి చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ సందర్భంగా నేను వెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ల ఫ్యామిలీలో పిల్లలంతా డాన్సులు చేశారు.  

అందరిలో బన్నీ చాలా బాగా చేశాడు. నాకు చాలా ముచ్చటగా అనిపించి, 'వీడు పెద్దయిన తరువాత పెద్ద స్టార్ అవుతాడు అని చెప్పి 100 రూపాయలు ఇచ్చాను. ఆ విషయం నేను మరిచిపోయాను. ఇటీవల బన్నీ వాళ్ల అమ్మగారు నాకు ఆ విషయం గుర్తు చేశారు. బన్నీ ఆ 100 రూపాయలు అలాగే దాచుకున్నాడని చెప్పారు" అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

మనవరాలిగా చేసిన శ్రీదేవే మీకు జోడీ అనగా ఎన్టీఆర్ రియాక్షన్

ఎన్టీ రామారావు - రాఘవేంద్రరావు కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకూ సూపర్ హిట్లే. అలాంటి సినిమాలలో 'వేటగాడు' ఒకటిగా కనిపిస్తుంది. 1979లో విడుదలైన ఆ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సాధించింది. తాజా ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

"శ్రీదేవి చేసిన 'పదహారేళ్ల వయసు' సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాతనే 'వేటగాడు' సినిమా చేయవలసి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవిని పెడదామని నేను నిర్మాతలతో అన్నాను. ఆ మాట వినగానే వాళ్లు కంగారు పడిపోయారు. 'బడిపంతులు' సినిమాలో ఎన్టీఆర్ కి మనవరాలిగా శ్రీదేవి చేసింది. అందువలన అన్నగారు కోప్పడతారేమోనని అన్నారు. 

ఎన్టీఆర్ గారితో నేను మాట్లాడతాను .. ఆయన ఓకే అంటే మీకు ఓకే కదా అన్నాను నేను .. ఓకే అన్నారు వాళ్లు. దాంతో నేను వెళ్లి రామారావుగారిని కలిశాను. '16 ఏళ్ల వయసు'లో చేసిన అమ్మాయిని 'వేటగాడు'లో హీరోయిన్ గా పెడదామని అనుకుంటున్నట్టుగా చెప్పాను. అలాగే కానివ్వండి బ్రదర్ .. ఆమెకి పదహారేళ్లు అయితే మనకి పద్నాలుగే కదా" అంటూ ఆయన నవ్వేశారు" అని చెప్పారు.