చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం బ్రేక్ తర్వాత ఈ పిటిషన్లపై విచారణ జరగనుందని హైకోర్టు వర్గాలు తెలిపాయి. టీడీపీ పాలనలో అమలు చేసిన ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ అధికారులు చంద్రబాబుపై కేసు పెట్టారు. దీంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) కాంట్రాక్టు విషయంలో అవకతవకలు జరిగాయని, క్విడ్ కో ప్రో కు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై మరో కేసు నమోదు చేశారు.

సీఐడీ పెట్టిన ఈ రెండు కేసులలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. నేడు విచారించనుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఈ పిటిషన్లపై విచారణ జరగనున్నట్లు సమాచారం.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల భేటీ శుభ పరిణామం: రఘురామకృష్ణరాజు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం కావడం శుభ పరిణామమని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి మంచి నిర్ణయాలు అవసరమని... దీనికి కావాల్సిన కార్యాచరణను చంద్రబాబు రూపొందిస్తున్నారని చెప్పారు. వీరి సమావేశంపై సాక్షి పత్రికలో ఇష్టంవచ్చినట్టు రాస్తున్నారని... ప్యాకేజీ అంటున్నారని విమర్శించారు. మీకన్నా ఎక్కువ ప్యాకేజీలు ఎవరు ఇవ్వగలరని ప్రశ్నించారు. 

లోకేశ్ పాదయాత్ర సక్సెస్ అయిందని రఘురాజు అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ లోకేశ్ ముందుకు వెళుతున్నారని చెప్పారు. యువగళం విజయోత్సవ సభ ఎల్లుండి అద్భుతంగా జరగబోతోందని... ఈ సభకు పవన్ కల్యాణ్ తప్పకుండా వస్తారని అన్నారు. టీడీపీ, జనసేన కూటమిలోకి త్వరలోనే మరో పార్టీ కచ్చితంగా వస్తుందని జోస్యం చెప్పారు.