ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపు లేదు.. అందులో చేరొద్దు: యూజీసీ హెచ్చరిక

ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపు లేదు.. అందులో చేరొద్దు: యూజీసీ హెచ్చరిక

ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపు లేదు.. అందులో చేరొద్దు: యూజీసీ హెచ్చరిక

ఎంఫిల్ ప్రోగ్రామ్‌లకు గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరోసారి స్పష్టం చేసింది. వీటిల్లో చేరొద్దంటూ విద్యార్థులకు సూచించింది. కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికీ ఎంఫిల్ ప్రోగ్రాముల్లో అడ్మిషన్లు చేపడుతున్నట్టు తమ దృష్టికి రావడంతో ఈ నోటీసులు జారీ చేశామని వెల్లడించింది. 

‘‘కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్ ప్రోగ్రామ్‌లల్లో అడ్మిషన్లు చేపడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఎంఫిల్‌ను ఓ డిగ్రీగా మేము గుర్తించట్లేదు. ఉన్నత విద్యాసంస్థలు ఎంఫిల్ కోర్సులు అందించకూడదని 2022 నాటి రెగ్యులేషన్ నెం.14లో స్పష్టంగా ఉంది’’ అని యూజీసీ తన నోటీసులో పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరంలో ఎంఫిల్ అడ్మిషన్లు తక్షణం నిలిపివేయాలని యూనివర్సిటీలను కోరినట్టు వెల్లడించింది. విద్యార్థులు కూడా ఆయా ప్రోగ్రామ్స్‌లో చేరొద్దని స్పష్టం చేసింది.