20 ఏళ్ల కెరియర్ చూసిన కాజల్..సీనియర్ హీరోల సరసన ఇప్పటికీ బిజీనే

20 ఏళ్ల కెరియర్ చూసిన కాజల్..సీనియర్ హీరోల సరసన ఇప్పటికీ బిజీనే

20 ఏళ్ల కెరియర్ చూసిన కాజల్..సీనియర్ హీరోల సరసన ఇప్పటికీ బిజీనే

వెండితెరపై కథానాయికగా 20 ఏళ్ల పాటు రాజ్యమేలిన అందమైన భామలలో కాజల్ ఒకరు. 'లక్ష్మి కల్యాణం' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కాజల్, 'చందమామ' సినిమాతో, 'తెలుగు తెర చందమామ' అనిపించుకుంది. యూత్ లో క్రేజ్ తో పాటు, వరుసగా అవకాశాలను అందుకుంటూ వెళ్లింది. గట్టిపోటీ ఉన్నప్పటికీ స్టార్ స్టేటస్ ను అందుకోవడానికి ఆమెకి ఎక్కువ సమయం పట్టలేదు.

తెలుగు .. తమిళ భాషల్లో ఏక కాలంలో స్టార్ హీరోల సినిమాలలో మెరుస్తూ, భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకున్న కథానాయికల జాబితాలో కాజల్ కనిపిస్తుంది. అలాగే ఈ రెండు భాషల్లో చేస్తూనే, బాలీవుడ్ ను టచ్ చేసిన కథానాయికలలో కూడా ఆమె ఒకరిగా కనిపిస్తుంది. వివాహమై .. ఒక బిడ్డకు జన్మనిచ్చిన కాజల్, ఇప్పుడు సీనియర్ హీరోల సరసన బిజీ అయింది. 

కాజల్ లేటెస్ట్ పిక్స్ చూసిన వాళ్లంతా ఆమె గ్లామర్ మరింత పెరిగిందనే చెబుతున్నారు. గతంలో  కంటే ఇప్పుడే మరింత అందంగా కనిపిస్తోందని అంటున్నవారూ ఉన్నారు. హీరోయిన్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న సీనియర్ హీరోలకు ఇక్కడి ఫస్టు ఆప్షన్ కాజల్ అనే అంటున్నారు. ఆమె కెరియర్ కి ఇప్పట్లో ఢోకా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.