వెంకటేశ్ 75వ సినిమాగా 'సైంధవ్'..ఈ నెల 7న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్

వెంకటేశ్ 75వ సినిమాగా 'సైంధవ్'..ఈ నెల 7న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్

వెంకటేశ్ 75వ సినిమాగా 'సైంధవ్'..ఈ నెల 7న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్

వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందిన 'సైంధవ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మించారు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 7వ తేదీన వైజాగ్ లోని గోకుల్ పార్క్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు. 

వెంకటేశ్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో ఆర్య .. నవాజుద్దీన్ సిద్ధికీ .. ఆండ్రియా .. రుహని శర్మ కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది. ఈ సినిమా తన కెరియర్ లోనే బెస్ట్ గా నిలుస్తుందని వెంకటేశ్ చెప్పడంతో, అభిమానులంతా మరింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.