విడిపోనున్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్.. పాక్ క్రికెటర్ జంట?

విడిపోనున్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్.. పాక్ క్రికెటర్ జంట?

విడిపోనున్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్.. పాక్ క్రికెటర్ జంట?

అయితే, 13 ఏళ్ల వివాహ బంధానికి తెరదించుతూ.. వీరిద్దరూ త్వరలోనే తమ విడిపోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం.. పెళ్లిళ్లయినా.. పెటాకులయినా.. అందరికీ తెలిసేది అందులోనే.. నాలుగు అక్షరాలు పోస్ట్ చేయడం.. ఏ ఇన్ స్టాలోనో, ఫేస్ బుక్ లోనో, ట్విటర్ లోనో పెట్టడం.. జనం లోకి వదలడం.. ఇదీ ట్రెండ్. ఇందులోనూ విడాకుల కథ మరింత ప్రత్యేకం. భాగస్వామితో విడిపోతున్నారని తెలిసేలా ప్రత్యేక సంకేతం ఉంటుంది. అదే.. అతడు లేదా ఆమెను అన్ ఫాలో చేయడం. లేదా తమ బయోలో భాగస్వామి పేరు తీసేయడం. లేదా పరస్పరం అన్ ఫాలో చేసుకోవడం. ఈ జాబితా లోకి ఇప్పుడో ప్రముఖ క్రీడా జంట చేరింది.

ఎక్కడో పుట్టి.. ఎక్కడో కలిసి

సానియా మీర్జా భారత్ లో టెన్నిస్ కు పర్యాయపదం. పక్కా హైదరాబాదీ. షోయబ్ మాలిక్.. పాకిస్థానీ క్రికెటర్. ఆ దేశ జాతీయ జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. అటు సానియా వ్యక్తిగతంగా ఎన్నో ఘనతలు సాధించింది. గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లను తన ఖాతా లో వేసుకుంది. ఇటు షోయబ్ తన జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. వీరిద్దరూ 2010లో ఒక్కటయ్యారు. అయితే, 13 ఏళ్ల వివాహ బంధానికి తెరదించుతూ.. వీరిద్దరూ త్వరలోనే తమ విడిపోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా షోయబ్ మాలిక్ తన ఇన్‌ స్టాగ్రామ్ బయోలో మార్పు చేయడమే ఇందుకు కారణం. ఇంతకుముందు షోయబ్ మాలిక్ ఇన్‌ స్టా బయోలో 'హజ్జెండ్ టూ ఏ సూపర్ ఉమెన్ ఎట్ మీర్జా సానియా' అని ఉండేది. ఇప్పుడు దానిని 'ఫాదర్ టు వన్ ట్రూ బ్లెస్సింగ్' అంటూ మార్చాడు.

ఇప్పుడే కాదు..  గతం లోనూ వదంతులు సానియా-మాలిక్ విడిపోతున్నారంటూ ఆరు నెలల కిందట కూడా వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, దాని ని సానియా కుటుంబం ఖండించింది. అదే సమయంలో సానియా, షోయబ్‌ కొత్త టాక్ షో 'ది మీర్జా మాలిక్ షో' రావడంతో వారి విడాకుల ఊహాగానాలకు తెరపడింది.

మళ్లీ ఇప్పుడు మాలిక్ చర్యతో వారి విడాకుల వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తల పై ఇప్పటివరకు సానియా, షోయబ్ ఎవరూ స్పందించలేదు. వీరికి 2018లో ఇజహాన్ జన్మించాడు. చిచ్చుపెట్టింది యాంకరేనా? సానియా-షోయబ్ జంట వివాహం అనంతరం తమ కెరీర్ లకు ఇబ్బంది రాకుండా దుబాయ్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

అంతేగాక సానియా తన భారత మూలాల ను మార్చుకోలేదు. హైదరాబాదీన ని గర్వంగా చెప్పుకొనేది. కాగా, వీరి సంసారంలో చిచ్చుకు కారణం పాక్ నటి అయేషా ఉమర్‌ అని తెలుస్తోంది. ఆమెతో మాలిక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ప్రచారం ఉంది. ఈ కథనాల ను అయేషా కొట్టిపారేసింది. కాగా, సానియా కు షోయబ్ తో వివాహానికి ముందు హైదరాబాద్ లో ప్రఖ్యాత కరాచీ బేకరీ యజమాని కుమారుడితో ఎంగేజ్ మెంట్ అయింది. దాని ని రద్దు చేసుకున్నాక.. షోయబ్ ను వివాహమాడింది సానియా.