యుక్రెయిన్‌తో శాంతి చర్చలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమన్నారు?
యుక్రెయిన్‌తో శాంతి చర్చలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమన్నారు?

యుక్రెయిన్‌పై శాంతి చర్చల ఆలోచనను తాను తిరస్కరించనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆఫ్రికా నాయకులతో సమావేశం తర్వాత శనివారం రాత్రి పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.ఆఫ్రికా, చైనా చొరవ శాంతి స్థాపనకు ఒక ప్రాతిపదిక కాగలదని ఆయన చెప్పారు.
యుక్రెయిన్ సైన్యం దాడులు చేస్తున్న సమయంలో కాల్పుల విరమణ పాటించడం కష్టమని పుతిన్ చెప్పారు.
అవతలి పక్షం కొన్ని ముందస్తు షరతులకు అంగీకరిస్తే తప్ప తాము చర్చలకు రాబోమమని రష్యా, యుక్రెయిన్ రెండూ గతంలో ప్రకటించాయి.
1991 నాటికి రష్యాతో యుక్రెయిన్ సరిహద్దులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఆ స్థితిని పునరుద్ధరించాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. దీనిని రష్యా పూర్తిగా వ్యతిరేకిస్తోంది.
చర్చలు జరగాలంటే యుక్రెయిన్ క్షేత్రస్థాయి వాస్తవాన్ని అంగీకరించాలని రష్యా చెబుతోంది.