మాజీ మంత్రి నారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మరదలు కృష్ణప్రియ!

మాజీ మంత్రి నారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మరదలు కృష్ణప్రియ!

మాజీ మంత్రి నారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మరదలు కృష్ణప్రియ!
మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు కృష్ణప్రియ చేసిన తీవ్ర ఆరోపణల వివాదం మరో మలుపు తిరిగింది. తన భార్యకు మానసిక ఆరోగ్యం బాగాలేదని, ఆమె వీడియోలను పట్టించుకోవద్దని నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. కానీ తాజాగా కృష్ణప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చర్చనీయాంశమవుతోంది.
ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కృష్ణప్రియ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఆమె ఫిర్యాదును అందజేశారు. తన బావ నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీంతో నారాయణపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. తాను మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్నానని తన భర్త చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది.