మణిపూర్ అల్లర్లకు అసలు కారణమిదేనా ?

మణిపూర్ అల్లర్లకు అసలు కారణమిదేనా ?

మణిపూర్ అల్లర్లకు అసలు కారణమిదేనా ?

మణిపూర్ అల్లర్లకు కారణాలు రిజర్వేషన్ డిమాండ్లు, జాతుల మధ్య విభేదాల ని రాజకీయ పార్టీలు పదేపదే చెబుతున్నాయి. అయితే సామాజిక విశ్లేషకులు మాత్రం రాజకీయ నేతల తో విభేదిస్తున్నారు. మణిపూర్లో ప్రస్తుత అల్లర్లకు కారణం భూపోరాటాలు, ఆధిపత్య పోరాటాలేన ని అభిప్రాయపడుతున్నారు. భూపోరాటాలు, ఆధిపత్య పోరాటాలంటే వ్యవసాయం కోసం భూములు కావాల ని, ఆధిపత్య పోరాటాలంటే రిజర్వేషన్లను పెంచుకునో లేదా రిజర్వేషన్లను వర్తింపచేసుకుని లాభపడదామని కాదట. భూమిపైన ఉన్న వాటికోసం కాకుండా భూమి లోపలున్న నిక్షేపాల కోసమేనట గొడవలన్నీ.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మణిపూర్ రాష్ట్రం మొత్తం అపారమైన నిక్షేపాల కు, విలువైన ఖనిజాల కు పుట్టినిల్లట. లక్షల కోట్లరూపాయల విలువైన ప్రకృతి సంపద మణిపూర్ సొంతమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రకృతి వనరుల పై పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కన్నుపడిందట.

భూముల ను సొంతం చేసుకుంటే లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలతో వ్యాపారాల ను విస్తరించుకోవాలని పారిశ్రామికవేత్తలు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం బయట పారిశ్రామికవేత్తలు మణిపూర్లోకి అడుగుపెట్టలేకపోతున్నారట.

పోనీ రాష్ట్రం లోని వాళ్ళనే బినామీలుగా చేసుకుని ఖనిజాల తవ్వకంలాంటివి చేయించాలన్నా సాధ్యం కావటం లేదట. ఎందుకంటే మణిపూర్ మొత్తం లోయలు, కొండల తోనే నిండుంటుంది. లోయ ప్రాంతాల్లో మొయితీలది పూర్తి ఆధిపత్యం. అలాగే కొండలమీదంతా కుకీలు, నాగాలదే ఆధిపత్యం. కొండల మీదకు మయన్మార్, బంగ్లాదేశ్ నుండి ఎక్కువగా వలసలు, ఉగ్రవాదులు వచ్చేస్తున్నారట.

దీంతో పారిశ్రామికవేత్తలు తాము బయట ఉండి లోపలి వాళ్ళతో ఖనిజాలు తవ్వించుకోవటం కష్టంగా మారిందట. డైరెక్టుగా తాము రంగం లోకి దిగితే కానీ ఖనిజాల తవ్వకం లాంటి భారీ వ్యాపారాల ను చేయటం సాధ్యంకాదని పారిశ్రామికవేత్తల కు అర్ధమైపోయిందట. అందుకు జరగాల్సిందేమంటే రాజ్యాంగం లో కొన్ని మార్పులు. ప్రస్తుతమున్న రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం లోని సర్వహక్కులు రాష్ట్రం లోని వాళ్ళకే సొంతం.

బయట వాళ్ళు వ్యాపారాలు చేయటం అంత తేలికకాదట. అందుకనే రాజ్యాంగం లో సవరణలు చేయించేట్లుగానే తరచూ మణిపూర్లో అల్లర్లు జరిపిస్తున్నట్లుగా సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భూపోరాటాలు, రిజర్వేషన్లు, జాతుల మధ్య వైరమంతా పైకి కనిపించే కారణాలు మాత్రమే అని అసలు కారణాలంతా భూమిలోపల నిక్షేపాల కోసమే అని విశ్లేషకులు తేల్చేశారు.