'బేబి' సినిమాతో హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య

'బేబి' సినిమాతో హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య

'బేబి' సినిమాతో హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య

ఇండస్ట్రీకి పరిచయమైన కథానాయికలు తమ మొదటి సినిమాతోనే హిట్ కొట్టాలని కలలు కంటారు. కానీ కొంతమంది విషయంలో మాత్రమే ఆ కల నిజమవుతుంది. అలాంటి కథానాయికలలో వైష్ణవి చైతన్య కూడా కనిపిస్తుంది. 'బేబి' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి, ఆ సినిమా సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఆ తరువాత ఆమె ఆనంద్ దేవరకొండ జోడీగానే మరో సినిమాను అంగీకరించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఇక ఆశిష్ సరసన కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మరో సినిమాలో చోటు దక్కించుకుంది. అదీ సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా. 

శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా 'బొమ్మరిల్లు భాస్కర్' ఒక సినిమా చేస్తున్నాడు. ఆగస్టులోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికగా వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారు. ఈ రోజున ఆమె పుట్టినరోజు కావడంతో ఈ సినిమా టీమ్ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసింది.