త్రివిక్రమ్ నుంచి 'గుంటూరు కారం' .. మహేశ్ జోడీగా ఇద్దరు భామలు

త్రివిక్రమ్ నుంచి 'గుంటూరు కారం' .. మహేశ్ జోడీగా ఇద్దరు భామలు

త్రివిక్రమ్ నుంచి 'గుంటూరు కారం'  ..   మహేశ్ జోడీగా ఇద్దరు భామలు

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమాగా 'గుంటూరు కారం' రానుంది. భారీ బడ్జెట్ తో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. మహేశ్ అభిమానులంతా ఈ డేట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

 ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ఆ వేదికపై నుంచే థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. మహేశ్ బాబును ఇంతకుముందు చూడని విధంగా ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపించనున్నాడు. అలాగే మహేశ్ బాబు ఇంతవరకూ వేయని నాటు స్టెప్పులు ఈ సినిమాలో ఆయనతో వేయించాడు. దాంతో ఆడియన్స్ ఈ కొత్తదనానికి బాగా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలోని పొలిటికల్ ఫైట్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని అంటున్నారు.    

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వచ్చిన పాటలన్నీ జనంలోకి దూసుకుపోయాయి .. ముఖ్యంగా 'కుర్చీ మడతపెట్టి' ఎక్కడ చూసినా వినిపిస్తోంది. శ్రీలీల - మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.