జస్టిన్ ట్రూడో: కెనడా ప్రధాని విడాకులు

జస్టిన్ ట్రూడో: కెనడా ప్రధాని విడాకులు

జస్టిన్ ట్రూడో: కెనడా ప్రధాని విడాకులు

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన భార్య సోఫీ తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు.

విడాకుల తరువాత కూడా ప్రేమ, గౌరవాలతో క్లోజ్ ఫ్యామిలీగానే ఉంటామని ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.

ట్రూడో, సోఫీలకు 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

కాగా విడాకుల ఒప్పందంపై ఇద్దరూ సంతకం చేసినప్పటికీ కలిసి ప్రజల్లోకి వస్తారని ట్రూడో కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

అయితే, గత కొంత కాలంగా వీరిద్దరూ బహిరంగంగా కలిసి కనిపించింది తక్కువే. ఈ ఏడాది మే నెలలో కింగ్ చార్ల్స్ 3 పట్టాభిషేకానికి ఇద్దరూ కలిసివెళ్లారు.

అంతకుముందు మార్చి నెలలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యటన సందర్భంగానూ ఈ దంపతులు కలసికట్టుగా ఆతిథ్యమిచ్చారు.

కాగా పదవిలో ఉంటుండగా విడాకులు తీసుకున్న రెండో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. అంతకుముందు ఆయన తండ్రి ఎలియట్ ట్రూడో కూడా ప్రధాని పదవిలో ఉన్నప్పుడే తన భార్య మార్గరెట్ ట్రూడోతో విడిపోయారు.