జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదన్న షర్మిల .. కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని వ్యాఖ్య

జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదన్న షర్మిల .. కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని వ్యాఖ్య

జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదన్న షర్మిల  .. కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని వ్యాఖ్య

కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కాసేపటి క్రితం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.

 అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా... జగన్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ... కుటుంబంలో చిచ్చు గురించి జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ హైకమాండ్ తనకు ఇంకా బాధ్యతలను అప్పజెప్పలేదని... ఆంధ్ర అయినా, అండమాన్ అయినా ఎక్కడ బాధ్యతలను అప్పగించినా పార్టీ విజయం కోసం పని చేస్తానని చెప్పారు. తనకు అప్పగించే బాధ్యతలపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు.

 ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం కచ్చితంగా ఉంటుంది: బ్రదర్ అనిల్

 కుమార్

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. షర్మిలకు రాహుల్, ఖర్గేలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు. షర్మిల పక్కనే ఆయన వేదికపై ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో బ్రదర్ అనిల్ మాట్లాడుతూ... కాంగ్రెస్ కుటుంబంలో తాము కూడా సభ్యులమే అని చెప్పారు. ఈ దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. 

పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారని... కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ లో షర్మిల చేరడం ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా... ఏపీలో కచ్చితంగా షర్మిల ప్రభావం ఉంటుందని అన్నారు. మీ బావమరిది, సీఎం జగన్ కు వ్యతిరేకంగా పని చేయమని హైకమాండ్ ఆదేశిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా... అధిష్ఠానం ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పారు.