గుడ్‌న్యూస్! తగ్గిన బంగారం ధర.. మళ్ళీ పెరిగే ఛాన్స్.. ఇప్పుడే కొనుక్కోండి

గుడ్‌న్యూస్! తగ్గిన బంగారం ధర.. మళ్ళీ పెరిగే ఛాన్స్.. ఇప్పుడే కొనుక్కోండి

గుడ్‌న్యూస్! తగ్గిన బంగారం ధర.. మళ్ళీ పెరిగే ఛాన్స్.. ఇప్పుడే కొనుక్కోండి

బంగారం కొనాలనుకునే వారికి అదిరే గుడ్‌న్యూస్! వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు కాస్త తగ్గాయి. దేశీయ మార్కెట్ లో బంగారం రేటు తగ్గినా, వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. బంగారం, వెండి ధరల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో చూస్తే వరుసగా పెరుగుతున్న బంగారం రేటు నిన్నటితో పోలిస్తే దాదాపు 10 డాలర్లకు పైనే ఎగబాకింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఈ రోజు 1964 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికొస్తే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారతీయ కరెన్సీ రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది. టుడే డాలర్‌తో పోల్చుకుంటే రూ.82.233 వద్ద కొనసాగుతోంది.  హైరదాబాద్‌లో గోల్డ్ రేట్ ఈ రోజు పరిశీలిస్తే స్వల్పంగా దిగివచ్చింది.

22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు రూ.55,250 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే 10 గ్రాములకు రూ.100 దిగి రూ.60,280 వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో వెండి రేట్లు గత రెండు రోజుల నుండి స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. అయితే ఆయా ప్రాంతాల్లో ట్యాక్సులు, కమీషన్ల వంటివి ఉంటాయి కాబట్టి వాటి కారణంగా ధరలు మారుతుంటాయి.

ఆగస్టు 1న 22 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 5,525 ( ₹ -10 )
  • 8 గ్రాములు: ₹ 44,200 ( ₹ -80 )
  • 10 గ్రాములు: ₹ 55,250 ( ₹ -100 )
  • 100 గ్రాములు: ₹ 5,52,500 ( ₹ -1000 )

ఆగస్టు 1న 24 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 6,028 ( ₹ -10 )
  • 8 గ్రాములు: ₹ 48,224 ( ₹ -80)
  • 10 గ్రాములు: ₹ 60, 280 ( ₹ -100 )
  • 100 గ్రాములు: ₹ 6,02,800 ( ₹ -1000 )

ఆగస్టు 1న వెండి ధరలు:

  • 1 గ్రాము: ₹80 ( ₹ 0 )
  • 8 గ్రాములు: ₹ 640 ( ₹ 0 )
  • 10 గ్రాములు: ₹ 800 ( ₹ 0 )
  • 100 గ్రాములు: ₹ 8000 ( ₹ 0 )
  • 1000 గ్రాములు: ₹ 80000 ( ₹ 0 )