ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ బంపరాఫర్.. 20శాతం రాయితీతో ప్లాట్లు, వారికి మరో 5శాతం
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ బంపరాఫర్.. 20శాతం రాయితీతో ప్లాట్లు, వారికి మరో 5శాతం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేసి, 20 శాతం రాయితీతో ప్లాట్లను అందిస్తోంది ప్రభుత్వం. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎంఐజీ జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ (Jagananna Smart Townships)లో వీటిని ఇస్తున్నామని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ తెలిపారు. ఈ ప్లాట్లు 200, 240 చదరపు గజాలుగా అందుబాటులో ఉన్నాయని.. చదరపు గజానికి రూ.17,499గా ధర నిర్ణయించామన్నారు. ఒప్పందం అయిన నెల లోపు మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లించిన వారికి 5శాతం తగ్గింపు ఉంటుందన్నారు.
అంతేకాదు 40శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు ఇస్తున్నట్లు వివేక్ యాదవ్ తెలిపారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం ఉందని.. ఇతర వివరాలు ఎంఐజీ పోర్టల్ https://migapdtcp.ap.gov.in, ఏపీసీఆర్‌డీఏ పోర్టల్ https://crda.ap.gov.in లో ఆగస్టు 1 నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ఆగస్టు 31 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని.. ఇతర వివరాలకు 0866-2527124 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. అవసరమైన ఉద్యోగులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు.
అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు మరో అవకాశాన్ని ఇచ్చింది జగన్ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. జీవో నంబరు 38 ద్వారా రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నవారైనా.. వారు కోరుకున్నచోట ప్లాట్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. గతంలో ఉన్న నిబంధనల్ని మార్పులు చేసింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో మార్కెట్ ధర కంటే తక్కువకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేయొచ్చు. ఈ లే అవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 ప్లాట్లు రిజర్వ్ చేయడంతో పాటు ధరలో 20 శాతం రిబేట్ సౌకర్యం కూడా ఉంది. ఈ లే అవుట్స్ వివరాలను https:// migapdtcp. ap. gov. in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.