అమ్మాయి పుడితే రూ.21 వేలు.. అదిరే స్కీమ్‌ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

అమ్మాయి పుడితే రూ.21 వేలు.. అదిరే స్కీమ్‌ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

అమ్మాయి పుడితే రూ.21 వేలు.. అదిరే స్కీమ్‌ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

ఇంట్లో అమ్మాయి పుట్టిన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆడపిల్లల భవిష్యతు కోసం రూ. 21 వేల రూపాయలను అందిస్తుంది.
ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మాయి పుడితే ఆర్థిక భద్రత కల్పించేలా పలు పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది. ‘ఆప్ కీ బేటి-హమారీ బేటి యోజన పథకం కింద ఆడపిల్ల పుడితే హర్యానా ప్రభుత్వం రూ. 21 వేలు అందిస్తుంది. బాలబాలికల మధ్య లింగ నిష్పత్తి వ్యత్యాసాన్ని తగ్గించడం, భ్రూణ హత్యలను నిరోధించడం వంటి ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. హర్యానాప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. దిగ్గజ బీమా రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తో కలిసి ఈ పథకాన్ని అందిస్తుంది. పుట్టిన పాప పేరు మీద రూ. 21 వేల రూపాయలను ఎల్ఐసీలో హర్యానా ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది.

ఈ పెట్టుబడి అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ డబ్బులను తీసుకోవచ్చు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ మాట్లాడుతూ.. సమాజంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఉన్న వివక్షకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ఆడపిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు, బాలికలను పాఠశాలలకు పంపించేందుకు, చదువు మానిపించకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ పథకం కింద ఎస్సీ కులాలు, పేద కుటుంబాలకు మొదటి ఆడబిడ్డ, రెండవ, మూడవ ఆడ బిడ్డ పుడితే రూ. 21 వేలు ఇస్తామని.. అలానే ఇతర కుటుంబాలకు కూడా రెండవ, మూడవ ఆడ బిడ్డ పుడితే రూ. 21 వేలు ఇస్తామని సీఎం అన్నారు. ఆడపిల్లల చదువు కోసం, భవిష్యత్తు కోసం అనేక పథకాలు అమలులో ఉన్నాయి.

తాజాగా ఆప్ కి బేటి-హమారీ బేటి యోజన పథకం కింద 4,30,278 ఆడబిడ్డలు లబ్దిపొందనున్నారని సీఎం అన్నారు. ఈ 21 వేల రూపాయలను అమ్మాయి పేరు మీద ఎల్ఐసీలో పెట్టుబడి పెడతామని.. 18 ఏళ్ల తర్వాత అవి లక్ష రూపాయలు అవుతాయని అన్నారు. అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చాక ఉన్నారా చదువు కోసం, పెళ్లి కోసం చాలా డబ్బు అవసరమవుతుందని.. ఆ సమయంలో ఆప్ కి బేటి-హమారీ బేటి పథకం ద్వారా వచ్చే డబ్బు సహాయపడుతుందని అన్నారు. డబ్బు ఇస్తే దుర్వినియోగం అవుతుందని.. అదే వారి పేరు మీద డిపాజిట్ చేస్తే అవి పెరగడమే కాకుండా అమ్మాయి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. హర్యానా సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్స్ సమర్థిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. మరి హర్యానా ప్రభుత్వం ఆడపిల్లలకు రూ. 21 వేలు ఇస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.